జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ అఫైర్స్ చైర్మన్ గా పులి శేఖర్ నియామకం

06-02-2019 Wed 17:00
  • యూఎస్ లో తన వ్యాపారాన్ని శేఖర్ వదులుకున్నారు
  • పార్టీ కోసం పని చేసేందుకు నిబద్ధతతో వచ్చారు
  • స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం ఆయనది
జనసేన పార్టీలోని కమిటీల నియామకంలో భాగంగా సెంట్రల్ కమిటీ ఫర్ అఫైర్స్ (సీసీపీఏ) చైర్మన్ గా పులి శేఖర్ ని నియమించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రవాసాంధ్రుడైన పులి శేఖర్, అమెరికాలోని తన వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని వదులుకొని పార్టీ కోసం పని చేసేందుకు నిబద్ధతతో వచ్చారని ప్రశంసించారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన పులి శేఖర్ లో సామాజిక స్పృహ, పాలనలో పాదర్శకత ఉండాలన్న తపన ఆయనలో మెండుగా ఉన్నాయని కొనియాడారు.

అనంతరం, పులి శేఖర్ మాట్లాడుతూ, సిద్ధాంత బలంతో నిర్మితమైన పార్టీ ‘జనసేన’ అని, పవన్ కల్యాణ్ ఆలోచన విధానం, ఆయన భావజాలం తననెంతో ఆకర్షించాయని, ఈ రాష్ట్రం వారి నాయకత్వం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోందని, తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు.