charan: అభిమానులకు గుర్తుండిపోయేలా .. చరణ్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్

  • రాజమౌళి నుంచి మల్టీ స్టారర్
  • నిర్మాతగా డీవీవీ దానయ్య 
  • 2020లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్ లో 'ఆర్ ఆర్ ఆర్' (వర్కింగ్ టైటిల్) రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చరణ్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. చెక్ పోస్ట్ దగ్గర ఆయన ఒక రౌడీ గ్యాంగ్ ను అడ్డుకోవడం .. ఆ గ్యాంగ్ పై విరుచుకుపడటం చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్ లో వందలమంది ఫైటర్లు పాల్గొంటున్నట్టుగా సమాచారం. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ ఎపిసోడ్ నిలిచిపోతుందని చెబుతున్నారు. చరణ్ అభిమానులు విజిల్స్ వర్షం కురిపించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 300 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాను 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. 

More Telugu News