ap mandal: సీపీఎస్‌ విధానంపై ఏపీ శాసనమండలిలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం

  • తిరస్కరించిన చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం
  • కాసేపు చైర్మన్‌ పోడియం వద్ద నిరసన
  • రేపు చలో అసెంబ్లీ నిర్వహిస్తామని ప్రకటన

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా పరిణమించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఉదయం సమావేశాలు ప్రారంభంకాగానే పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలంతా ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యంకు తమ వాయిదా తీర్మానాన్ని అందజేశారు.

 దీన్ని చైర్మన్‌ తిరస్కరించడంతో ఎమ్మెల్సీంతా ఆయన పోడియం వద్ద కాసేపు నిరసన తెలియజేశారు. వెంటనే స్పందించిన చైర్మన్‌ సుబ్రహ్మణ్యం సంబంధిత మంత్రితో సమావేశం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీలు తమ నిరసన విరమించారు. అనంతరం వారు మాట్లాడుతూ  ఉద్యోగులకు నష్టదాయకమైన  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాల్సిందేనని, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకు నిరసన తెలియజేస్తామన్నారు. గురువారం చలో అసెంబ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

More Telugu News