USA: చదువుకోసం వెళ్లే అమెరికా విద్యార్థులకు ట్రంప్ కఠిన హెచ్చరిక!

  • చట్టాలను గౌరవించాల్సిందే
  • తప్పుడు మార్గాల్లో ప్రవేశిస్తే కఠిన చర్యలు
  • యూఎస్ కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్

ఏదైనా విద్యను అభ్యసించాలని అమెరికాకు వచ్చే వారు ఎవరైనా, ఇక్కడి చట్టాలను తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని, ఏమాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా, తప్పుడు మార్గాల్లో దేశంలోకి ప్రవేశించినా కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంళో పాల్గొని ప్రసంగించిన ఆయన, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. "గతంలో ఈ గదిలో ఉన్న వారంతా గోడ కట్టేందుకు అంగీకరించారు. అయితే, ఆ పని మాత్రం జరుగలేదు. నేను పూర్తి చేసి చూపిస్తాను" అని ఆయన అన్నారు.

కాగా, మెక్సికో సరిహద్దుల్లో 5.7 బిలియన్ డాలర్ల వ్యయంతో శాశ్వత సరిహద్దును నిర్మించాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అటు అధికార, ఇటు విపక్ష పార్టీల సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం స్తంభించింది. 35 రోజులకు పైగా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు కొందరు సీనియర్ ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. తాజా సంక్షోభానికి ట్రంప్ వైఖరే కారణమని 50 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడుతున్నట్టు రాయ్ టర్స్ వెల్లడించింది.

More Telugu News