Coolpad Cool 3: ఆకట్టుకునే ఫీచర్లతో కూల్ ప్యాడ్ నుండి నూతన స్మార్ట్ ఫోన్

  • 'కూల్ 3' విడుదల 
  • ధర రూ.5,999
  • నాలుగు రంగులలో లభ్యం

చైనా మొబైల్ సంస్థ కూల్ ప్యాడ్ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 'కూల్ 3' పేరిట విడుదలైన ఈ ఫోన్ మిడ్‌ నైట్ బ్లూ, రూబీ బ్లాక్‌, ఓషియ‌న్ ఇండిగో, టీల్ గ్రీన్ అనే రంగులలో లభించనుంది. ఈ ఫోన్ ధర మన దేశంలో రూ.5,999గా నిర్ణయించారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌ లాక్ లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్లున్న ఈ ఫోన్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.

ప్రత్యేకతలు:

  • ఆండ్రాయిడ్ 9.0పై
  • 5.71" హెచ్‌ డీ ప్ల‌స్ డిస్‌ప్లే (1520 x 720 పిక్స‌ల్స్)
  • గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌
  • 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌
  • 8/0.3 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

More Telugu News