పీఎం-కిసాన్ పథకం.. నలుగురు కుటుంబ సభ్యులే ఒక యూనిట్ !

Tue, Feb 05, 2019, 03:20 PM
  • రైతు కుటుంబమే యూనిట్
  • అంటే, భార్య, భర్త, 18 ఏళ్ల లోపు పిల్లలు ఇద్దరు 
  • వాళ్లందరికీ ఐదెకరాల లోపు సొంత సాగు భూమి ఉండాలి
2019  కేంద్ర బడ్జెట్ లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద రైతులకు రూ.6000 ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ 1 నుంచి ఈ పథకాన్ని రైతులకు వర్తింపజేయనున్నారు. ఈ పథకానికి ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ఉన్న భూమీ దస్త్రాలనే  కేంద్రం పరిగణనలోకి తీసుకోనుంది. అర్హులైన రైతుల గుర్తింపునకు సంబంధించి రైతు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోనుంది. ఈ పథకానికి సంబంధించిన ప్రధానాంశాల వివరాలు...

- ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6000 మొత్తాన్ని 3 విడతలుగా అందిస్తారు. నాలుగు నెలలకోసారి రూ.2 వేల చొప్పున అందజేస్తారు. 1.12.2018 నుంచి 31.3.2019 కాలానికి ఒక విడత మొత్తాన్ని మార్చి నెలాఖరు నాటికి రూ.2 వేలు ఇస్తారు.

- రైతు కుటుంబం యూనిట్ గా అంటే.. భర్త, భార్య, ఇద్దరు పిల్లలు (18 ఏళ్ల లోపు). వీళ్లందరికీ కలిపి 5 ఎకరాల లోపు సొంత సాగుభూమి ఉండాలి.

- ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రాల్లో ఉండే భూ దస్త్రాల నమోదు విధానమే ప్రాతిపదిక

- 2019 ఫిబ్రవరిలోగా భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు ఆల్ లైన్ లో నమోదై ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తారు.

- ఒక రైతు కుటుంబానికి వివిధ గ్రామాలు/ రెవెన్యూ గ్రామాల్లో ఉన్నవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.

- ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూమి యాజమాన్య హక్కులు వచ్చే వాటిని ఐదేళ్ల దాకా పరిగణనలోకి తీసుకోరు. అప్పటికే పథకం వర్తించే ఖాతాలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కులను వారసులకు బదిలీ చేస్తే ప్రయోజనం వర్తింపజేస్తారు.

- కొన్ని రాష్ట్రాల్లో కౌలు రైతులు ఈ పథకం ప్రయోజనాలకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు కేంద్రం అమలు చేస్తున్న నమూనా కౌలుదారుచట్టాన్ని అనుసరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement