Yanamala: ఏ శాఖకు ఎన్ని కోట్ల కేటాయింపులంటే... ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు!

  • అసెంబ్లీ ముందుకు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్
  • ప్రతిపాదనలు సమర్పించిన యనమల రామకృష్ణుడు
  • మొత్తం బడ్జెట్ అంచనా రూ. 2.26 లక్షల కోట్లు

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ముందుకు వచ్చింది. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, అమరావతి అసెంబ్లీలో తన మూడవ బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచారు. ఏపీ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ముఖ్యాంశాలు...

* మొత్తం బడ్జెట్ అంచనా రూ. 2,26,177.53 కోట్లు.
* రెవెన్యూ వ్యయం రూ. 1,80,369.33 కోట్లు.
* రెవెన్యూ మిగులు రూ. 2,099.47 కోట్లు.
* ఆర్థిక లోటు రూ. 32,390.68 కోట్లు.
* ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం.
* స్వరాష్ట్రంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది.
* ఎన్నో ప్రతికూలతల మధ్య విజయాలు సాధించాం.
* చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యం.
* నేటి తరం మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు.
* మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట.
* ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 'పసుపు - కుంకుమ' తెచ్చాం.
* ఈ పథకానికి రూ. 4 వేల కోట్ల కేటాయింపు.
* ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగులకు చేయూత.
* నిరుద్యోగ భృతి రూ. 1,000 నుంచి రూ. 2,000కు పెంపు.
* వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు
* పశుసంవర్థక, మత్స్య శాఖలకు రూ. 2030.87 కోట్లు.
* బీసీ సంక్షేమానికి రూ. 8,242.64 కోట్లు
* పర్యావరణం, అటవీ శాఖలకు రూ. 491.93 కోట్లు.
* ఉన్నత విద్యకు రూ. 3,171.63 కోట్లు.
* ప్రాథమిక విద్యకు రూ. 22,783.37 కోట్లు.
* పౌర సరఫరాల శాఖకు రూ. 3,763.42 కోట్లు.
* వైద్య శాఖకు రూ. 10,032.15 కోట్లు.
* హోమ్ శాఖకు రూ. 6,397.94 కోట్లు.
* గృహ నిర్మాణ శాఖకు రూ. 4,079.10 కోట్లు.
* నీటి పారుదల శాఖకు రూ. 16,852.27 కోట్లు.
* పరిశ్రమల శాఖకు రూ. 4,114.92 కోట్లు.
* ఐటీ శాఖకు రూ. 1,006.81 కోట్లు.
* కార్మిక, ఉపాధి శాఖలకు రూ. 1,225.75 కోట్లు.
* న్యాయ శాఖకు రూ. 918.81 కోట్లు.
* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 7,979.34 కోట్లు.
* మైనారిటీల సంక్షేమానికి రూ. 1,308.73 కోట్లు.
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ. 35,182.61 కోట్లు.
* రెవెన్యూ శాఖకు రూ. 5,546.94 కోట్లు.
* స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 458.66 కోట్లు.
* సాంఘిక సంక్షేమానికి రూ. 6,861.60 కోట్లు.
* రోడ్లు, భవనాల శాఖకు రూ. 5,382.83 కోట్లు.
* స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 3,408.66 కోట్లు.
* క్రీడలు, యువజన శాఖకు రూ. 1,982.74 కోట్లు.
* ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 14,363.34 కోట్లు.
* బీసీ సబ్ ప్లాన్ కు రూ. 5,385.31 కోట్లు.
* 'అన్నదాతా సుఖీభవ' కార్యక్రమానికి రూ. 5 వేల కోట్లు.
* ఇళ్ల స్థలాల సేకరణ నిమిత్తం రూ. 500 కోట్లు.
* చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 400 కోట్లు.
* డ్రైవర్ల సాధికారత కోసం రూ. 150 కోట్లు.
* క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లు.
* ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 1000 కోట్లు.
* వ్యవసాయ ఆధునికీకరణకు రూ. 300.17 కోట్లు.
* విత్తనాభివృద్ధి నిమిత్తం రూ. 200 కోట్లు.
* ఉద్యానవన శాఖకు రూ. 124 కోట్లు.
* చంద్రన్న బీమాకు రూ. 354.02 కోట్లు.
* అన్న క్యాంటీన్ల కోసం రూ. 300 కోట్లు.
* చంద్రన్న పెళ్లి కానుక నిమిత్తం రూ. 428.47 కోట్లు.
* ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ కోసం రూ. 100 కోట్లు.
* ఇమామ్, మౌజన్ లకు రూ. 100 కోట్లు.
* బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 100 కోట్లు.
* వైశ్య కార్పొరేషన్ కు రూ. 50 కోట్లు.
* వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ. 10,401.05 కోట్లు.
* వికలాంగుల పెన్షన్లకు రూ. 2,133.62 కోట్లు.
* డప్పు కళాకారుల పెన్షన్లకు రూ. 108 కోట్లు.
* ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్లకు రూ. 100 కోట్లు.
* రాజధాని ల్యాండ్ పూలింగ్ కు రూ. 226 కోట్లు.
* ఎన్ఆర్ఈజీఎస్ పథకానికి రూ. 1000 కోట్లు.
* రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లకు రాష్ట్ర వాటాగా రూ. 180 కోట్లు.
* చేనేత రంగానికి రూ. 225 కోట్లు.

More Telugu News