priya prakash: దుమ్మురేపేస్తోన్న 'లవర్స్ డే' సాంగ్

  • మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్'
  • తెలుగు టైటిల్ గా 'లవర్స్ డే'
  • ఈ నెల 14వ తేదీన విడుదల

యూత్ లో ఇప్పుడు ప్రియా ప్రకాశ్ వారియర్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. మలయాళంలో ఒమర్ లులు దర్శకత్వంలో ఆమె 'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాను చేసింది. షాన్ రెహ్మాన్ ఈ సినిమాకి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.

'వాలెంటైన్స్ డే' సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఓ మైగాడ్ పోయా ..' అంటూ ఈ సాంగ్ మొదలవుతోంది. కాలేజ్ క్యాంపస్ లో స్టూడెంట్స్ పై చాలా కలర్ ఫుల్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించారు. జోరుగా .. హుషారుగా కొనసాగుతోన్న ఈ సినిమా, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలానే వుంది. ఇక ప్రియా క్రేజ్ ఈ సినిమాకి ఏ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతుందో చూడాలి.                     

More Telugu News