sensex: నష్టాల్లో కొనసాగి చివరి గంటలో కోలుకున్న మార్కెట్లు

  • బ్యాంక్, ఐటీ, ఎనర్జీ రంగాల్లో చివర్లో ఊపందుకున్న కొనుగోళ్లు
  • 113 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 19 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత లాభాల బాట పట్టాయి. చివరి గంటలో బ్యాంక్, ఐటీ, ఎనర్జీ రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో... ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో 36,583కు పెరిగింది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 10,912కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, కొటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్ తదితర కంపెనీలు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, ఐటీసీ తదితర కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

More Telugu News