Mahesh Babu: మహేశ్ బాబు సొంత బ్యానర్లోనే అనిల్ రావిపూడి మూవీ

  • 'మహర్షి' సినిమాతో బిజీగా మహేశ్
  • తదుపరి సినిమా సుకుమార్ తో
  •  అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్  

మహేశ్ బాబు 25వ చిత్రంగా 'మహర్షి' రూపొందుతోంది. సంఖ్యా పరంగా మహేశ్ బాబు కెరియర్లో ఇది ప్రత్యేకమైన చిత్రం కావడంతో, దర్శకుడు వంశీ పైడిపల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకోవడంతో, తదుపరి ప్రాజెక్టుపై మహేశ్ బాబు దృష్టి పెట్టాడు. ఆయన తదుపరి సినిమా సుకుమార్ తో వున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి చకాచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడితో ప్రాజెక్టును కూడా మహేశ్ బాబు ఖాయం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి మహేశ్ ను కలిసి కథను వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. మహేశ్ బాబు సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని సమాచారం. అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా ఉంటాడని చెబుతున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి .. మహేశ్ బాబును లైన్లో పెట్టేశాడన్న మాట. 

More Telugu News