yatra: 'యాత్ర' సినిమా మొదటి షో టికెట్ ధర రూ. 4.37 లక్షలు.. వేలంలో పాడిన ఎన్నారై!

  • ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న 'యాత్ర'
  • అమెరికాలో మొదటి షో టికెట్ కు వేలంపాట
  • భారీ మొత్తానికి టికెట్ ను సొంతం చేసుకున్న మునీశ్వర్ రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈనెల 8న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సంచలనం రేపుతోంది. అమెరికాలో ఈ చిత్రం మొదటి షో టికెట్ ను వేలం వేశారు. మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి టికెట్ ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. మన కరెన్సీలో దీని ధర అక్షరాలా రూ. 4.37 లక్షలు. అమెరికాలోని సియాటెల్ లో ఈ వేలంపాటను నిర్వహించారు.

More Telugu News