Shruti Hasan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మళ్లీ వస్తున్న శ్రుతి హాసన్ 
  • ముంబైలో 'చిత్రలహరి' షూటింగ్ 
  • విజయ్ దేవరకొండ మరో చిత్రం  

*  గత కొంత కాలంగా తెలుగు, తమిళ చిత్రాలకు దూరంగా ఉంటున్న కథానాయిక శ్రుతి హాసన్ త్వరలో ఓ తమిళ చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసం శ్రుతి హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమా చేయడానికి ఆమె ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
*  కిశోర్ తిరుమల దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ ప్రస్తుతం 'చిత్రలహరి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో జరుగుతోంది. కల్యాణి ప్రియదర్శిన్, నివేద పేతురాజ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  ఇటీవల 'హుషారు' చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న నూతన దర్శకుడు శ్రీహర్ష తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడట. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీహర్ష మీడియాకు తెలిపాడు. 

More Telugu News