Anantapur District: తోపుదుర్తిలో ఉద్రిక్తత.. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం!

  • డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని నిరసన
  • నల్ల జెండాలు ధరించి ఆందోళన
  • మహిళలను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ ను అడ్డుకునేందుకు డ్వాక్రా మహిళలు యత్నించారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న హామీని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

నల్ల జెండాలు ధరించి ఆందోళనకు దిగారు. కాన్వాయ్ ను మహిళలు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. కాగా, డ్వాక్రా మహిళల ఆందోళన కారణంగా యాలేరు గ్రామ శివారులో పరిటాల సునీత గంటకు పైగా వేచి ఉన్నారు. తోపుదుర్తికి సునీత కాన్వాయ్ నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది. 

More Telugu News