america: నకిలీ వర్శిటీ కేసు: అమెరికాకు నిరసన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం

  • నకిలీ యూనివర్శిటీలో చేరిన భారత విద్యార్థులు
  • దాదాపు 129 మంది విద్యార్థులను నిర్బంధించిన అమెరికా
  • నిరసన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ

దాదాపు 129 మంది భారత విద్యార్థులను వీసా కుంభకోణంలో అమెరికా ప్రభుత్వం నిర్బంధించడం పట్ల భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు నిరసనతో కూడిన విన్నపాన్ని అమెరికా దౌత్యకార్యాలయానికి పంపింది. ఇబ్బందుల్లో ఉన్న తమ విద్యార్థులను రక్షించుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తెలిపింది.

నకిలీ యూనివర్శిటీ ఉన్నది అమెరికా గడ్డపై అని... మోసపోయిన వారు తమ విద్యార్థులని చెప్పింది. విద్యార్థులను యూనివర్శిటీలో చేర్పించినవారే మోసగాళ్లని... తమ విద్యార్థులను మోసగాళ్లుగా చూడరాదని కోరింది. మోసం చేసిన వారిలా వీరిపై చర్యలు తీసుకోరాదని తెలిపింది. తమ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని... వారి అంగీకారం లేకుండా బలవంతంగా స్వదేశానికి పంపవద్దని కోరింది.

More Telugu News