Team India: న్యూజిలాండ్‌తో చివరి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

  • జట్టులోకి వచ్చిన ధోనీ
  • మూడు మార్పులతో బరిలోకి దిగుతున్న భారత్
  • గాయంతో కివీస్ స్టార్ ఆటగాడు గప్టిల్ అవుట్

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న చివరి వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న ఈ వన్డేలో గెలిచి నాలుగో వన్డేలో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకోవాలని రోహిత్ శర్మ సేన భావిస్తోంది. మరోవైపు, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని కివీస్ పట్టుదలగా ఉంది.  ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

తొడకండరం గాయంతో బాధపడుతూ మూడు, నాలుగు వన్డేలకు దూరమైన మాజీ సారథి ధోనీ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో దినేశ్ కార్తీక్‌ జట్టు నుంచి తప్పుకున్నాడు. అలాగే, ఖలీల్ స్థానంలో మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చారు. కివీస్ మాత్రం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన గప్టిల్ స్థానంలో కొలిన్ మన్రో జట్టులోకి వచ్చాడు.

భారత జట్టు: రోహిత్‌శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, అంబటిరాయుడు, ఎంఎస్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, విజయ్‌శంకర్‌, భువనేశ్వర్‌కుమార్‌, మహమ్మద్‌ షమీ, యుజువేంద్ర చాహల్‌.

న్యూజిలాండ్‌ జట్టు: హన్రీ నికోల్స్‌, కొలిన్‌ మన్రో, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, కోలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌, టాడ్‌ ఆస్టిల్‌, మ్యాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌.

More Telugu News