AIU Officers: చిరుతను సూట్‌కేసులో కుక్కిన వారిది ఎంత కఠిన హృదయమో..!: చిన్మయి

  • చిరుతను సూట్‌కేసులో తీసుకెళుతున్న యువకుడు
  • పట్టుకున్న ఏఐయూ అధికారులు
  • అధికారులకు హ్యాట్సాఫ్ చెప్పిన చిన్మయి

ఒక నెల వయసున్న చిరుత పిల్లను సూట్‌కేసులో తీసుకెళుతూ.. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఐయూ అధికారులకు ఓ యువకుడు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూట్‌కేసులో చిరుతపిల్లను కుక్కి తీసుకెళ్లాలని మనుషులకు ఎలా అనిపిస్తుందో.. ఏమోనంటూ మండిపడ్డారు. ‘ఈ చిన్నారిని సూట్‌కేసులో కుక్కి రవాణా చేస్తున్న వారిది ఎంతటి కఠిన హృదయమో తెలియట్లేదు. ఈ పాపను కాపాడిన ఇంటెలిజెన్స్ అధికారులకు హ్యాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు.

More Telugu News