Chennai: ప్రయాణికుడి బ్యాగులో నెల వయసున్న చిరుతపిల్ల.. అధికారుల షాక్!

  • అనుమానాస్పదంగా యువకుడు
  • నిఘా పెట్టిన ఏఐయూ అధికారులు
  • గ్రీన్ ఛానల్ దాటగానే అడ్డుకున్నారు

నేటి ఉదయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు అనుమానాస్పదంగా తిరగడం గమనించిన ఏఐయూ అధికారులు అతని కదలికలపై గట్టి నిఘా పెట్టారు. ఆ ప్రయాణికుడు చెకిన్ సామాగ్రి తీసుకోగానే అక్కడి నుంచి వేగంగా పరిగెత్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు అనుమానం ఎక్కువైంది. వెంటనే వెళ్లి అతని సామగ్రిని స్కానింగ్ మెషీన్‌లో పెట్టగా.. దానిలో నుంచి అధికారులకు కొన్ని శబ్దాలు వినిపించాయి. దీంతో అతనిని గ్రీన్ ఛానల్ దాటగానే అడ్డుకుని విచారణ నిమిత్తం ఏఐయూ గదిలోకి తీసుకెళ్లి పరిశీలించిన అధికారులు షాక్ అయ్యారు.

ప్రయాణికుడి బ్యాగులో ఒక నెల వయసున్న చిరుత పిల్ల కనిపించింది. వెంటనే ఆ యువకుడి బోర్డింగ్ పాస్, పాస్‌పోర్టును జప్తు చేసిన అధికారులు.. చిరుత పిల్లను అరిగ్నర్ అన్నా జంతు ప్రదర్శశాలకు అప్పజెప్పారు. చట్ట విరుద్ధంగా బ్యాగులో చిరుత పిల్లను తీసుకొచ్చిన యువకుడిని పోలీసులు తమిళనాడు అటవీశాఖాధికారులకు అప్పజెప్పారు.

More Telugu News