chammak chandra: 'జబర్దస్త్' చమ్మక్ చంద్ర హీరోగా 'రామసక్కనోళ్లు'

  • కమెడియన్ గా చమ్మక్ చంద్రకి క్రేజ్ 
  • హీరోగా రంగంలోకి 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ

కమెడియన్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న కొంతమంది .. హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ జాబితాలోకి 'జబర్దస్త్' చమ్మక్ చంద్ర కూడా చేరిపోయాడు. 'జబర్దస్' కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న చమ్మక్ చంద్ర .. కమెడియన్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి హీరోగాను చేసే ఛాన్స్ వచ్చింది. ఆయన హీరోగా 'రామసక్కనోళ్లు' నిర్మితమవుతోంది. సతీశ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాజ్ కార్తికేన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. టైటిల్ ను బట్టి .. ఫస్టులుక్ పోస్టర్ ను బట్టి ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతోంది. మేఘన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ఘంటాడి కృష్ణ .. మహిత్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. హీరోగా చమ్మక్ చంద్ర ఏ స్థాయి సందడి చేస్తాడో చూడాలి మరి.

More Telugu News