contributery pension scheme: పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ మహా పాదయాత్ర

  • రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ
  • కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ రద్దుకు డిమాండ్‌
  • ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ చేపడుతున్న మహా పాదయాత్ర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ పాదయాత్ర సాగుతుందని యూటీఎఫ్‌ కృష్ణా జల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె.లెనిన్‌బాబు, ఎస్‌.పి.మనోహర్‌కుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.

గుంటూరు, ఏలూరు నుంచి రెండు బృందాలుగా ఉపాధ్యాయులు ఈ పాదయాత్ర చేపట్టి విజయవాడలో కలిసేటట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత విధానంలోకి రావాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సెషన్‌లోనే ఇందుకు అవసరమైన నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

More Telugu News