vijayashanthi: 'కర్తవ్యం' కథ విషయంలో అలా చేయడం వలన హిట్ అయింది: పరుచూరి గోపాలకృష్ణ

  • కథలో లోపాలు అప్పుడే తెలుస్తాయి
  • అక్షరాలతో నింపేది కథ కాదు
  • కథలో ఆత్మ లేకపోతే కష్టం          

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ .. కథాకథనాలను గురించి ప్రస్తావించారు. "కథను రాసుకున్న తరువాత ఒకసారి వెనక్కివెళ్లి చూసుకోవడం వలన లోపాలు ఏమైనా వుంటే తెలుస్తాయి. అద్దంలో ఎవరి ముఖం వాళ్లకి అందంగా కనిపించినట్టుగా .. ఎవరు రాసుకున్న కథ వాళ్లకి బాగా అనిపిస్తుంది. అక్షరాలతో నింపేది కథ కాదు .. అద్భుతాలతో నింపేది కథ.

'కర్తవ్యం' కథ విషయంలో మేము వెనక్కి వెళ్లి చూసుకున్నాము. కథలో ఆత్మ లేదనే విషయం అప్పుడు మాకు అర్థమైంది. 'కర్తవ్యం' సినిమాకి ఆత్మ ఏంటి? మీనా పాత్రపై అత్యాచారం జరగడం .. దానిపై సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి రియాక్ట్ కావడం. ఆ ఆత్మను తీసుకొచ్చి కథకు కలపకపోతే .. 'కర్తవ్యం' యావరేజ్ గానో .. బిలో యావరేజ్ గానో ఆడేదేమో. అలాగే 'సమరసింహా రెడ్డి' కథ విషయంలోను వెనక్కి వెళ్లి చూసుకోవడం వలన, ఫ్లాష్ బ్యాక్ ఎక్కడ చెప్పాలి? అనే విషయం అర్థమైంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News