paruchuri: సినిమా దెబ్బతినడానికి ఇవి ప్రధాన కారణాలవుతాయి: పరుచూరి గోపాలకృష్ణ

  • చెప్పుకున్నప్పుడు కథ బాగా ఉందనిపిస్తుంది
  • కథనంలో లోపం దెబ్బకొట్టేస్తుంది
  • ఒకసారి వెనక్కివెళ్లి చూసుకోవాలి

తెలుగు సినిమా కథతో పరుచూరి బ్రదర్స్ సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ వచ్చారు. కథకి కొత్త మాటలు నేర్పుతూ ముందుకు నడిపించారు. అలాంటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ .. 'పరుచూరి పాఠాలు'లో మాట్లాడుతూ కథకి సంబంధించిన విషయాలను గురించే ప్రస్తావించారు.

"కథను ఓ పది నిమిషాల్లో చెప్పుకున్నప్పుడు బాగుందనే అనిపిస్తుంది. కథ చెప్పుకున్నప్పుడు బాగానే అనిపించింది గదా .. మరి సినిమా ఎందుకు దెబ్బతింది? అని అనుకుంటూ వుంటారు. కథనం విషయంలో లోపం తలెత్తడం వల్లనే ఇలా జరుగుతుంది. ఏయే పాత్రలు ఎదగాలో అవి ఎదగకుండా .. ఏయే కథాంశాలు కదలాలో అవి కదలకుండా .. ఏయే మలుపులు ఎక్కడెక్కడ తిరగాలో అక్కడ తిరక్కుండా .. వాటి స్థానాలు మారిపోయినప్పుడు సినిమా దెబ్బతినడం జరుగుతుంది. అందువలన కథ .. కథనాల విషయంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడం మంచిది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News