refugee: క్యాంపులో ఉండి వాట్సాప్‌ ద్వారా పుస్తకం రాసిన శరణార్థి.. వరించిన ఆస్ట్రేలియా టాప్ ప్రైజ్

  • ఆరేళ్ల క్రితం పౌరసత్వం కోరుతూ ఆస్ట్రేలియాకు రాక
  • మనుస్ ఐలండ్‌లో క్యాంపులో ఉంటూనే పుస్తకం రాసిన వైనం
  • ఆనంద క్షణాలను సెలెబ్రేట్ చేసుకోబోనన్న బూచానీ

పపువా న్యూగినియాలోని ఓ శరణార్థి క్యాంపులో ఉన్న ఇరాన్ వ్యక్తికి ఆస్ట్రేలియాలోనే అతిపెద్దదైన సాహిత్య పురస్కారం లభించింది. ఆస్ట్రేలియా పౌరసత్వం కోరుతూ బోటులో దేశానికి చేరుకున్న శరణార్థుల్లో  ఒకడైన బెహరౌజ్ బూచానికి ఈ బహుమతి దక్కింది. ఆస్ట్రేలియాలోని శరణార్థి శిబిరాల్లో ఒకటైన మనుస్ ఐలండ్ క్యాంపులో ఉంటున్న బూచాని తన మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారా పుస్తకం రాశాడు.

‘నో ఫ్రెండ్స్ బట్ ది మౌంటైన్స్’ పేరుతో అతడు రాసిన తొలి పుస్తకమే ఆస్ట్రేలియాలోనే అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపికవడం గమనార్హం. ఇందుకు గాను అతడు 72,390 డాలర్లు అందుకోనున్నాడు. ఆరేళ్ల క్రితం శరణార్థిగా ఆస్ట్రేలియా వచ్చిన బూచానీ.. వెయ్యిమందికిపైగా శరణార్థులు క్యాంపుల్లో మగ్గుతున్నట్టు తెలిపాడు. తనకు అత్యుత్తమ సాహిత్య పురస్కారం దక్కినా ఈ ఆనంద క్షణాలను జరుపుకోబోనని బూచానీ పేర్కొన్నాడు. తనచుట్టూ వందలాదిమంది అమాయకులు ఇంకా బాధపడుతూనే ఉన్నారని పేర్కొన్నాడు.

More Telugu News