Jayant Sinha: కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతుంటే... వెనుకనుంచి వెక్కిరిస్తూ యువతి కొంటెపని... వీడియో!

  • పార్లమెంట్ ఎదుట ఘటన
  • మీడియాతో మాట్లాడిన జయంత్ సిన్హా
  • వెనుకనుంచి వెక్కిరించిన యువతి

కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా, పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న వేళ, వెనుక ఉన్న ఓ యువతి, వెక్కిరిస్తున్నట్టుగా, నాలుకను బయటకు చూపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. నిన్న పీయుష్ గోయల్, బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన తరువాత జయంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలావుండగా, ఆయన వెనుకే ఉన్న ఓ అమ్మాయి, కెమెరాను చూస్తూ, నాలుకను బయటపెట్టి వెక్కిరిస్తూ, కొంటెపని చేసింది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. "పీయుష్ గోయల్ బడ్జెట్ కు సూపర్ రివ్యూ" అని ఒకరు, "ఆమె తన అభిప్రాయం చెప్పిందని మరొకరు"... ఇలా సాగుతున్నాయి కామెంట్లు. ఆ వీడియోను మీరూ చూడండి.

More Telugu News