Telangana: తెరపైకి ఓటుకు నోటు కేసు.. వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు

  • వారం రోజుల్లో కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు
  • త్వరలో రేవంత్, సండ్ర తదితరులకు నోటీసులు
  • రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపారని అభియోగం

తెలంగాణలో ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏసీబీ అభియోగ పత్రాల ద్వారా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. త్వరలో ఈడీ.. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య సహా ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్, సండ్ర, సెబాస్టియన్, ఉదయసింహా కలిసి కుట్ర పన్నారని ఏసీబీ అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ముడుపులు ఇచ్చేందుకు నిందితులు ప్రయత్నించారని అభియోగ పత్రంలో పేర్కొంది.

More Telugu News