Rahul Gandhi: 15 మంది పారిశ్రామిక వేత్తలకు రూ.3.5 లక్షల కోట్లు.. రైతులకు మాత్రం 17 రూపాయలా?: రాహుల్ ధ్వజం

  • ఇది రైతులను అవమానించడం కాదా?
  • ఈసీతో ఈవీఎంల అంశంపై మాట్లాడతాం
  • 4వ తేదీన ఈసీని కలుస్తాం

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ, రైతులకు రోజుకు రూ.17 మాత్రమే ఇస్తారా..? ఇది రైతులను అవమానించడం కాదా? అంటూ విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో విపక్ష నేతల సమావేశంలో పాల్గొన్న రాహుల్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సోమవారం నాడు విపక్ష నేతలమంతా కలిసి ఈసీతో ఈవీఎంల అంశంపై మాట్లాడతామని తెలిపారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల సంఘాన్ని కలుసుకోనున్నట్టు రాహుల్ చెప్పారు. 

More Telugu News