Congress: అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్ల లబ్ధి నేరుగా చేకూర్చారు: రాహుల్ ఆరోపణలు

  • ఎన్డీఏ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది
  • నాలుగున్నరేళ్ళలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది
  • ఈవీఎంల విషయమై ఈసీ అధికారులను కలుస్తాం

ఎన్డీఏ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఈరోజు నిర్వహించిన ఎన్డీయేతర పక్షాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘సేవ్ ది నేషన్- సేవ్ డెమోక్రసీ’ పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో 25 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఎన్డీఏ పాలనలో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్ల లబ్ధి నేరుగా చేకూరిందని ఆరోపించారు. నాలుగున్నరేళ్ళలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈవీఎంల విషయమై ఎన్నికల సంఘం అధికారులను సోమవారం కలుస్తామని, ఓ డాక్యుమెంట్ ను వారికి అందజేస్తామని చెప్పారు. ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని దుమ్మెత్తిపోశారు.

More Telugu News