Venkatesh: అనిల్ రావిపూడిని అరెస్ట్ చేసిన వరుణ్ తేజ్.. ట్విట్టర్లో సరదా ఫొటోను పోస్ట్ చేసిన మెగా హీరో!

  • బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న‘ఎఫ్2’
  • సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వరుణ్
  • నకిలీ పోలీసును కలవండంటూ పోస్ట్

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్2’. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నటించిన వారందరిలో వరుణ్ తేజ్ మాత్రం ‘ఎఫ్2’ సినిమా సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా వరుణ్ తేజ్ ఓ సరదా ట్వీట్‌తో పాటు, ఫొటోను కూడా షేర్ చేశారు. ‘థియేటర్లలో కడుపుబ్బా నవ్వించినందుకు అరెస్ట్ చేస్తున్నా’ అంటూ అనిల్ రావిపూడి చేతికి బేడీలు వేస్తున్న ఫొటోను షేర్ చేశాడు. అలాగే ‘నకిలీ పోలీసును కలవండి’ అంటూ మరో ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలను, కామెంట్లను చూసిన నెటిజన్లు సరదా సరదా కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News