MP Kavitha: ప్రభుత్వ ఘనతలు చెప్పిన గోయల్ వైఫల్యాల గురించి మాత్రం ప్రస్తావించలేదు: ఎంపీ కవిత విసుర్లు

  • నిస్పందేహంగా ఎన్నికల బడ్జెట్టే 
  • పన్ను సంస్కరణలు ఊరటనిస్తాయి
  • రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారు

కేంద్రం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిజామాబాద్ ఎంపీ కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది నిస్పందేహంగా ఎన్నికల బడ్జెట్టేనని తేల్చి చెప్పారు. అయితే పన్ను సంస్కరణలు మధ్య తరగతి, ఉద్యోగులకు ఊరటనిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని కవిత ఆరోపించారు.

తెలంగాణ ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు రూ.5000 చొప్పున రెండు విడతల్లో అందిస్తే.. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో 6 వేలే ఇస్తామంటోందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ ఘనతలు చెప్పిన పీయూష్ గోయల్ కేంద్ర వైఫల్యాల గురించి మాత్రం మాట్లాడలేదని కవిత పేర్కొన్నారు.

More Telugu News