KTR: పేరు మార్చి బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు: కేటీఆర్

  • ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్
  • అనుకరణకు మించిన ప్రశంస లేదు
  • రైతుబంధు పథకంతో సాయం అందటం హర్షణీయం

కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్‌లో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకంపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని పేరు మార్చి బడ్జెట్‌లో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. అనుకరణకు మించిన ప్రశంస మరొకటి లేదని.. కేసీఆర్ మానస పుత్రిక వంటి రైతు బంధు పథకంతో దేశ ప్రజలకు సాయం అందనుండటం హర్షణీయమని అన్నారు.

అయితే కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన ఎంఐఎం అధినేత ఒవైసీ మాత్రం కేసీఆర్ పథకాన్ని మోదీ కాపీ పేస్ట్ చేశారని.. కానీ ఆయనలా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి, సామర్థ్యాలు మోదీకి లేవని విమర్శించారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించే సమయం దగ్గరపడిందన్నారు.

More Telugu News