sensex: బడ్జెట్ ప్రభావంతో జోష్.. లాభాలలో ముగిసిన మార్కెట్లు

  • ఒకానొక సమయంలో 665 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • చివరకు 213 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
  • 63 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ప్రజాకర్షక మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో, మార్కెట్లలో జోష్ కనిపించింది. దీనికి తోడు కీలమైన వడ్డీ రేట్లను పెంచబోమని అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడి 36,469కి పెరిగింది. నిఫ్టీ 63 పాయింట్లు ఎగబాకి 10,894 వద్ద స్థిరపడింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 665 పాయింట్లు లాభపడింది. అయితే, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో లాభాలు తగ్గిపోయాయి.

ఈనాటి ట్రేడింగ్ లో ఆటో, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ, ఇన్ఫ్రా స్టాకులు లాభపడ్డాయి. మెటల్, బ్యాంకింగ్ స్టాకులు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ లో హీరో మోటో కార్ప్, మారుతి సుజుకి, హెచ్సీఎల్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాప్ లూజర్స్ లో వేదాంత, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఐసీఐసీఐ సంస్థలు ఉన్నాయి.

More Telugu News