manmohan singh: కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డ మన్మోహన్ సింగ్

  • ఎన్నికల తాయిలాలు ఇస్తున్నట్టుగా బడ్జెట్ ఉంది
  • ఇది ముమ్మాటికీ ఎన్నికల బడ్జెట్టే
  • పన్ను మినహాయింపులు ఇవ్వడం ఎన్నికలపై ప్రభావం చూపుతుంది

పార్లమెంటులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఈ బడ్జెట్ ప్రభావం చూపుతుందని మండిపడ్డారు. ఎన్నికల తాయిలాలు ఇస్తున్నట్టుగా బడ్జెట్ ఉందని... ఇది ముమ్మాటికీ ఎన్నికల బడ్జెట్ అంటూ దుయ్యబట్టారు. రైతులకు, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పారు.

రైతులు, గ్రామీణులు, మధ్యతరగతిని ఆకట్టుకునేలా నేటి బడ్జెట్ ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదని గోయల్ తెలిపారు. ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాదని... దేశ అభివృద్ధికి బాటలు పరిచే బడ్జెట్ అని చెప్పారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో గ్రాట్యుటీ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. 24 గంటల వ్యవధిలోనే ఇన్ కం ట్యాక్స్ రీఫండ్ ను పూర్తి చేస్తామని తెలిపారు.

More Telugu News