kavitha: కేసీఆర్ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది: కవిత

  • రైతుబంధు ద్వారా ఎకరానికి ఏడాదికి రెండు సార్లు రూ.5000ల చొప్పున ఇస్తున్నాం
  • కేంద్రం ఏడాదికి రూ. 6000 మాత్రమే ప్రకటించింది
  • ఈ పథకాన్ని మరింత మెరుగు పెట్టాల్సిన అవసరం ఉంది

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. రైతుబంధు ద్వారా ఏడాదికి రెండు సార్లు ప్రతి ఎకరానికి రూ. 5000ల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాదికి రూ. 6000 మాత్రమే ప్రకటించిందని... అది కూడా మూడు విడతల్లో ఇస్తామని తెలిపిందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదే అయినా... ఈ పథకాన్ని మరింత మెరుగు పరచాల్సి ఉందని చెప్పారు. ఐదు ఎకరాలలోపు భూమి గల రైతులకు ఏడాదికి రూ. 6000 ఇస్తామని ఈరోజు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News