Budget: బడ్జెట్ కు ఆమోదం పలికిన మోదీ సర్కారు... ముదురు ఎరుపు రంగు సూట్ కేసుతో పార్లమెంట్ చేరుకున్న పీయుష్ గోయల్!

  • ఉదయం 10 గంటలకు సమావేశమైన కేంద్ర క్యాబినెట్
  • విధాన పరమైన కీలక నిర్ణయాలు ఉండకపోవచ్చంటున్న నిపుణులు
  • కొన్ని ప్రజాకర్షక నిర్ణయాలకు చాన్స్

ఈ ఉదయం 10 గంటల తరువాత సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 2019-20 సంవత్సరానికి గాను ఈ ఉదయం పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం పలికింది. ఆర్థిక శాఖ బాధ్యతలు తన భుజానికి ఎత్తుకున్న పీయుష్ గోయల్, సంప్రదాయ ఎరుపు రంగు సూట్ కేసును పట్టుకుని పార్లమెంట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అభినందనలు తెలిపారు.

ఎన్డీయే సర్కారు  పదవీకాలం మూడు నెలల్లో ముగియనున్న తరుణంలో వస్తున్న మధ్యంతర బడ్జెట్ లో విధాన పరమైన కీలక నిర్ణయాలేవీ ఉండవని, పరిమిత కాలానికి సంబంధించిన ఖర్చులకు అనుమతి తీసుకోవడం మాత్రమే ఉంటుందని అంచనా. ఇదే సమయంలో ఎన్నికలు రానున్నాయి కాబట్టి, వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు, రైతుల కోసం ఓ ప్యాకేజీ, చిరు వ్యాపారులకు వడ్డీ రాయితీ తదితర ప్రజాకర్షక నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News