మాస్కో ఎయిర్ పోర్టులో నటుడు కరణ్ వీర్ బోహ్రా అరెస్ట్... వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్!

01-02-2019 Fri 09:10
  • రష్యాలో పర్యటిస్తున్న బిగ్ బాస్ సీజన్ 12 కంటెస్టెంట్ కరణ్ వీర్ బోహ్రా
  • చిరిగిన పాస్ పోర్ట్ ఉండటంతో మాస్కోలో అరెస్ట్
  • కొత్త పాస్ పోర్టును ఇప్పించిన సుష్మా స్వరాజ్
బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ సీజన్ 12 కంటెస్టెంట్ కరణ్ వీర్ బోహ్రా, ఓ చిరిగిపోయిన పాస్ పోర్టుతో రష్యాలో పర్యటిస్తున్న వేళ, మాస్కో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా, విషయం తెలుసుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వెంటనే మాస్కో దౌత్యాధికారులతో మాట్లాడిన ఆమె, తాత్కాలిక పాస్ పోర్టును ఆయనకు చేరేలా చేశారు. తన సమస్య తెలిసి, వెంటనే స్పందించి ఆదుకున్న సుష్మా స్వరాజ్ కు కరణ్ వీర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

 "నాకు ఓ కొత్త పాస్ పోర్టును అందించిన మాస్కోలోని ఇండియన్ ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు లేవు. సెలబ్రిటీ అయినా, సెలబ్రిటీ కాకపోయినా, విదేశాల్లో ప్రయాణించే భారతీయులు సురక్షితంగా ఉంటారని మరోసారి సుష్మా స్వరాజ్ నిరూపించారు. ఆమె చేసిన సాయానికి కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించారు.