Varun tej: మెగా హీరో సినిమా ‘వాల్మీకి’ టైటిల్‌పై వివాదం.. టైటిల్ మార్చకుంటే షూటింగ్‌ను అడ్డుకుంటామంటూ హెచ్చరిక

  • మహానందిలో జాతీయ వాల్మీకి ఐక్యపోరాట సమితి ఆందోళన
  • మహాకవి పేరును గ్యాంగ్‌స్టర్ సినిమాకు వాడుకోవడం తగదని హితవు
  • టైటిల్ మార్చకుంటే తీవ్ర పరిణామాలంటూ హెచ్చరిక

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా టైటిల్‌పై జాతీయ వాల్మీకి ఐక్యపోరాట సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిగర్తాండ’ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్ర టైటిల్ తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ ఏపీ వాల్మీకి బోయ సంఘం, బోయ హక్కుల పోరాట సమితి ఆందోళనకు దిగాయి.

వాల్మీకిగా మారిన బోయవాడు ఈ జగతికి రామాయణాన్ని అందించాడని, అలాంటి వ్యక్తి పేరును ఓ గ్యాంగ్‌స్టర్ సినిమాకు టైటిల్‌గా పెట్టడం సరికాదంటూ  గురువారం కర్నూలు జిల్లా మహానందిలో భారీ సంఖ్యలో వాల్మీకులు ఆందోళనకు దిగారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ టైటిల్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

కాదని ముందుకెళ్తే సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా అడ్డుకుని తీరుతామని సమితి ఉపాధ్యక్షుడు బోయ రామకృష్ణ డైరెక్టర్ హరీశ్ శంకర్‌ను హెచ్చరించారు. అయితే, సినిమా కథాంశం కూడా ఇలానే ఉంటుందని, కాబట్టే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామని దర్శకుడు చెబుతున్నారు.

More Telugu News