visakhapatnam: మైన్స్ అండ్ ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ శివాజీ ఇళ్లలో ముగిసిన ఏసీబీ సోదాలు!

  • ఎంవీపీ కాలనీలో జీ ప్లస్ త్రీ ఇల్లు
  • నిర్మాణంలో జీ ప్లస్ టు భవనం
  • ఆస్తుల విలువ మొత్తం రెండున్నర కోట్లు

విశాఖ జిల్లా అనకాపల్లి మైన్స్ అండ్ ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ గుండు శివాజీ ఇళ్లలో నేటి ఉదయం నుంచి కొనసాగిన ఏసీబీ సోదాలు సాయంత్రం ముగిశాయి. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని శివాజీ ఇల్లు, కార్యాలయాలు సహా మొత్తం 6 చోట్ల ఏకకాలంలో కొనసాగిన ఈ తనిఖీల్లో ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు వెల్లడైంది. ఈ తనిఖీల్లో ఎంవీపీ కాలనీలో జీ ప్లస్ త్రీ ఇల్లు, విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో జీ ప్లస్ టు భవనం ఉన్నట్టు కనుగొన్నారు.

ఇంట్లోనూ, బ్యాంకు లాకర్లోను కలిపి 83 లక్షల నగదు, 1796 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.3 కేజీల వెండి వస్తువులున్నట్టు గుర్తించారు. అలాగే కాపులుప్పాడలో 227 గజాల స్థలం, శివాజీ స్వగ్రామం బంటుపల్లిలో 22 సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ మొత్తం ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రెండున్నర కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.    

More Telugu News