Kichidi: విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో పాము.. షాక్ అయిన ఉపాధ్యాయులు!

  • పౌష్టికాహారంగా ప్రతిరోజూ కిచిడీ
  • తినకపోవడంతో తప్పిన ప్రమాదం
  • విచారణకు ఆదేశించిన అధికారులు

చిన్నారి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో పాము కనిపించటం.. పెను సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని నాంథేడ్‌కు దగ్గరలోని గర్గావన్ జిల్లా పరిషత్ ప్రైమరీ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మహారాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహారంగా ప్రతిరోజూ కిచిడీ అందిస్తుంది. ఈ కిచిడీని తయారు చేయించే బాధ్యతను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది.

అయితే తాజాగా ఆ పాఠశాలలో విద్యార్థులకు కిచిడీ వడ్డిస్తుండగా.. అందులో ఓ పాము కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే కిచిడీని వడ్డించడం ఆపేశారు. విద్యార్థులెవరూ దానిని తినకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఈ విషయాన్ని అక్కడి ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

More Telugu News