రాజస్థాన్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ జయభేరి.. 100కు పెరిగిన సంఖ్యాబలం

31-01-2019 Thu 17:54
  • బీఎస్పీ అభ్యర్థి మృతితో ఎన్నిక వాయిదా
  • రామ్‌గఢ్‌లో 27న జరిగిన ఎన్నిక
  • 12 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయం

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. గతేడాది డిసెంబర్ 7న రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనే రామ్‌గఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి మృతితో ఆ నియోజకవర్గ ఎన్నిక వాయిదా పడింది. తిరిగి ఈ నెల 27న ఎన్నిక నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్ అభ్యర్థి షఫియా జుబేర్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి సువంత్ సింగ్‌పై 12 వేల ఓట్ల మెజారిటీతో జుబేర్ విజయం సాధించారు. జుబేర్‌కు 83,311 ఓట్లు రాగా.. సువంత్‌కు 71,083 ఓట్లు వచ్చాయి. డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు సాధించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 100కు చేరుకుంది.