: మృతదేహం ఇస్తామంటేనే తీహార్ జైలుకు వస్తాం: అఫ్జల్ కుటుంబం

ఉగ్రవాది అఫ్జల్ గురు మృతదేహన్ని అప్పగించేందుకు అంగీకరిస్తేనే తీహార్ జైలులో అడుగు పెడతామని అతని కుటుంబం స్పష్టం చేసింది. అఫ్జల్ కు సంబంధించిన వస్తువులను కుటుంబానికి అందిస్తామని, అలాగే తీహార్ జైలులోని అతని సమాధి వద్ద వారు ప్రార్థన చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర హోం సెక్రటరీ ఆర్కే సింగ్ ఢిల్లీలో ప్రకటించారు.

దీనిపై స్పందించిన అఫ్జల్ కుటుంబం అతని వస్తువులు అందిస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. అయితే ప్రార్థనలను తమ ఇంటి నుంచైనా చేసుకుంటామని అందుకోసం తీహార్ జైలుకి రావల్సిన అవసరం లేదని అతని కుటుంబసభ్యులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేంద్రం ఇవ్వాలనుకుంటే తగిన రీతిన అంత్యక్రియలు జరిపేందుకు అఫ్జల్ మృతదేహన్ని ఇవ్వమని తేల్చి చెప్పారు.

More Telugu News