Rahul Gandhi: నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్ అయితే... రాహుల్ బ్రాహ్మణుడెలా?: కేంద్ర మంత్రి హెగ్డే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య

  • అనంత కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు
  • ప్రతి భారతీయుడినీ అగౌరవపరచినట్టేనన్న రాహుల్
  • హెగ్డేకు కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదని వ్యాఖ్య

బీజేపీ సీనియర్ నేత అనంత కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ హైబ్రిడ్ నమూనా అని ఆయన అన్నారు. ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి పుట్టిన వ్యక్తి బ్రాహ్మణుడినని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ మతానికి చెందిన వాడినన్న విషయం రాహుల్ కు తెలియదని, ఆయన అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ముస్లిం అని ఆరోపిస్తూ, తల్లి సోనియా క్రిస్టియన్ అని గుర్తు చేసిన హెగ్డే, రాహుల్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ కుటుంబ మతం, కులానికి సంబంధించి, ఇంత నమూనాలు మరే కుటుంబంలోనూ లేవని, అది ఒక్క కాంగ్రెస్ పార్టీ అధినేతలకే సాధ్యమని అన్నారు. మరో రెండు నెలల్లో రాహుల్ కొలంబియాకు పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కాగా, హెగ్డే వ్యాఖ్యలపై అంతే తీవ్రతతో స్పందించిన రాహుల్, ఆయన వ్యాఖ్యలు ప్రతి భారతీయుడినీ అగౌరవపరిచేవేనని అన్నారు. ఇకపై ఒక్క రోజు కూడా హెగ్డేకు కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు.

More Telugu News