sensex: ఆచితూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • అమెరికా-చైనాల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలు
  • ఒక పాయింట్ నష్టపోయిన సెన్సెక్స్
  • 10,651 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు జరగబోతున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1 పాయింట్ నష్టపోయి 35,591కి చేరింది. నిఫ్టీ అర పాయింట్ కోల్పోయి 10,651 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీలు లాభపడ్డాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, యస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐటీసీ తదితర కంపెనీలు నష్టపోయాయి.

More Telugu News