Kodali Nani: నాని సినిమాకి 53 కోట్ల మేర బిజినెస్!

  • క్రికెట్ నేపథ్యంలో జెర్సీ 
  • నాని జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్  

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా రూపొందుతోంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో క్రికెటర్ గా నాని కనిపించనున్నాడు. ప్రతికూల పరిస్థితులపై పోరాడిన ఓ యువకుడు తాను అనుకున్నది ఎలా సాధించాడు అనే ఇతివృత్తంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమా ఇప్పటికే 53 కోట్ల బిజినెస్ చేసిందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లు .. శాటిలైట్ రైట్స్ 12 కోట్లు .. హిందీ డబ్బింగ్ రైట్స్ 6 కోట్లు .. ఓవర్సీస్ 4 కోట్లు .. ఇతరత్రా మార్గాల్లో మరోకోటి బిజినెస్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేయడం మామూలు విషయం కాదని చెప్పుకుంటున్నారు. నాని జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో నాని వున్నాడు.

More Telugu News