modi: మోదీ గ్రాఫ్ పడిపోతోంది.. ఫెడరల్ ఫ్రంట్ కీలకపాత్ర పోషిస్తుంది: కవిత

  • ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయి
  • ఎంపీ నిధులను ఏడాదికి కనీసం రూ. 25 కోట్లకు పెంచాలి
  • రానున్న రోజుల్లో వైసీపీ సహా ఇతర పార్టీలను కలుస్తాం

ప్రధాని మోదీ గ్రాఫ్ నానాటికీ పడిపోతోందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకపాత్ర పోషించబోతోందని తెలిపారు. మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా... ఇప్పటికీ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను ఆమోదించలేదని విమర్శించారు. ఎంపీ నిధులను ఏడాదికి కనీసం రూ. 25 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో చౌపాల్ ఆన్ ట్విట్టర్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సమాధానాలను ఇచ్చారు.

విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చేలా టీఆర్ఎస్ ప్రోత్సహిస్తుందని కవిత అన్నారు. నిజామాబాద్ లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో నిజామాబాదులో మంచి నీరు, డ్రైనేజీ సమస్యలు ఉండవని తెలిపారు. తెలంగాణకు కేటాయించే నిధుల విషయంలో మోదీ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా రానున్న రోజుల్లో వైసీపీ సహా ఇతర పార్టీలను కలుస్తామని చెప్పారు.

More Telugu News