Honor View 20: భారత్ కు వచ్చేసిన ఆనర్ వ్యూ20 స్మార్ట్ ఫోన్.. క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన జియో, పేటీఎం

  • ఇటీవలే పలు దేశాలలో విడుదల
  • జియో కస్టమర్లకు రూ.2200 క్యాష్ బ్యాక్
  • పేటీఎం వినియోగదారులకి రూ.1,400 క్యాష్ బ్యాక్

ఇటీవలే వివిధ దేశాలలో విడుదలైన ఆనర్ వ్యూ20 స్మార్ట్ ఫోన్ తాజాగా భారత మార్కెట్లో కూడా విడుదలైంది. 6 జీబీ/8 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది. ఈరోజు నుండే అమెజాన్, ఆనర్ స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ పై జియో, పేటీఎం, ఐసీఐసీఐ సంస్థలు పలు ఆఫర్లని ప్రకటించాయి. ఈ ఫోన్ కొనుగోలు చేసే జియో కస్టమర్లకు రూ.2200 క్యాష్ బ్యాక్ తో పాటు 2.2 టీబీ డేటా ఉచితంగా లభించనుండగా,పేటీఎం వినియోగదారులకి రూ.1,400 క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే, ఐసీఐసీఐ కార్డుల ద్వారా 5 శాతం డిస్కౌంట్ కూడా పొందనున్నారు. కాగా, 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఫోన్ ధరలు వరుసగా రూ.37,999, రూ.45,999గా ఉన్నాయి.

More Telugu News