తెలుగులో మరో బయోపిక్‌... తెరకెక్కనున్న అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర

30-01-2019 Wed 12:34
  • ప్రణాళికలు వేస్తున్న నిర్మాత సునీల్‌రెడ్డి
  • మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం
  • ఆగస్టు నాటికి రిలీజ్‌ చెయ్యాలన్న ఆలోచన
తెలుగులో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురి జీవిత చరిత్రలు తెరకెక్కగా తాజాగా మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు నిర్మాత సునీల్‌రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో సావిత్రి జీవిత చరిత్ర ‘మహానటి’తో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఆ కోవలో ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలు తెరకెక్కుతున్నాయి.

ఇప్పుడు తాజాగా అల్లూరి కూడా ఈ లిస్ట్ లో చేరారు. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని, ఆగస్టు నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని నిర్మాత యోచిస్తున్నట్లు సమాచారం. సినిమా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లోనే చిత్రీకరించాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.