Jayalalita: నవ్వేవారు, కసిరేవారు... జయలలిత ఆఖరి రోజులపై డ్యూటీ డాక్టర్ సాక్ష్యం!

  • జయకు చికిత్స చేసిన డ్యూటీ డాక్టర్ శిల్ప
  • చనిపోయే ముందు రోజు వరకూ విధుల్లో 
  • జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ ముందు సాక్ష్యం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన ఆఖరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ, ఆమె మానసిక స్థితి అస్థిరంగా కనిపించిందని జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ ముందు హాజరై సాక్ష్యం ఇచ్చిన డ్యూటీ డాక్టర్ శిల్ప పేర్కొన్నారు. చాలా సార్లు ఆమె ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేవారని చెప్పిన శిల్ప, కొన్నిసార్లు నవ్వుతూ కనిపించేవారని, మరి కొన్నిసార్లు తనను ఒంటరిగా వదిలేయాలని కసురుకునేవారని అన్నారు.

కాగా, జయ మరణించడానికి ముందు రోజు వరకూ అంటే, డిసెంబర్ 4 వరకూ డ్యూటీ డాక్టర్లలో శిల్ప పేరు ఉంది. దీంతో జయ మృతిపై విచారిస్తున్న కమిటీకి శిల్ప సాక్ష్యం కీలకమని భావిస్తున్నారు. 2016 సెప్టెంబర్ 23న జయ తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆపై, దాదాపు రెండున్నర నెలలకు ఆమె మరణించారు. జయ మరణంపై పలు వివాదాలు, ప్రశ్నలు తలెత్తడంతో జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె మృతిపై విచారణ జరిపిస్తోంది.

More Telugu News