Telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఘట్టంలో చివరి అంకం... బారులు తీరిన ఓటర్లు!

  • ప్రారంభమైన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
  • నేడు 3,529 పంచాయతీల్లో పోలింగ్
  • 32,055 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణ రాష్టంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొద్దిసేపటి క్రితం మొదలైంది. తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 29 జిల్లాల్లోని 3,529 గ్రామ పంచాయతీల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 32,055 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కాగా, 11,667 మంది సర్పంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక వార్డుల విషయానికి వస్తే, 27,583 వార్డులకుగాను 67,316 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఓటర్లు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరగా, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్‌ పూర్తి కానుండగా, ఆపై సాయంత్రంలోగా ఓట్ల లెక్కింపును పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 7,043 పంచాయతీలకు పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

More Telugu News