Hyderabad: హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో పేలుడు!

  • వెంకటగిరి చౌరస్తాలో పేలుడు
  • ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
  • స్థానికుల్లో భయాందోళన

హైదరాబాద్ లో పగలు, రాత్రి తేడాలేకుండా నిత్యమూ బిజీగా ఉండే జూబ్లీహిల్స్, వెంకటగిరిలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదుగానీ, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో నిర్మాణాలు అధికంగా జరుగుతూ ఉండటంతో ఏదైనా డిటొనేటర్ పేలి వుండవచ్చని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News