undavalli: ఆంధ్రావాళ్లు అంటే కోటీశ్వరులు, వ్యాపారులనే భావన ఢిల్లీలో ఉంది: ఉండవల్లి

  • రానున్న ఎన్నికల్లో ఈ భావం పోవాలి
  • రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎవరూ మర్చిపోకూడదు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలసి పోరాడుదాం

ఆంధ్రప్రదేశ్ వాళ్లంటే కోటీశ్వరులు, వ్యాపారవేత్తలనే భావన డిల్లీలో ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం గురించి వారు పట్టించుకోరని, సొంత విషయాలు మాత్రమే చూసుకుంటారని ఉత్తర భారతీయులు అనుకునే పరిస్థితి ఉందని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఈ భావం పోవాలని... రాష్ట్రానికి ఏ అవసరం వచ్చినా అందరూ కలసి ఉంటారనే ఉద్దేశంతోనే తాను ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. విజయవాడలో జరిగిన అఖిలపక్షం, మేధావుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, అవమానాలను ఏ ఒక్కరూ మర్చిపోకూడదని ఉండవల్లి చెప్పారు. ప్రతిస్పందించకపోతే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర విభజన ఇంత దారుణంగా జరగలేదని చెప్పారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలుపొందవచ్చని... కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలసి పోరాడుదామని విన్నవించారు.

More Telugu News