ayodhya: వివాదంలో లేని అయోధ్య భూమిని యజమానులకు అప్పగిస్తాం.. అనుమతివ్వండి: సుప్రీంకోర్టును కోరిన కేంద్రం

  • రామ జన్మభూమి వివాదాస్పద ప్రాంతం 2.77 ఎకరాలు
  • వివాదంలో లేని భూమి 67 ఎకరాలు
  • ఆ భూమిని అప్పగించాలంటూ యజమానులు కోరుతున్నారన్న కేంద్రం

వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీ మసీదు కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. వివాదంలో లేని 67 ఎకరాల భూమిని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. భూమి యజమాని అయిన రామ జన్మభూమి నయాస్ లేదా రామాలయానికి చెందిన ట్రస్టుకు అప్పగించేందుకు అనుమతించాలని కోరుతూ సుప్రీంలో ఈరోజు కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. రామ జన్మభూమి వివాదాస్పద ప్రాంతం 2.77 ఎకరాలు. వివాదం నేపథ్యంలో, ఈ స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాల ప్రాంతాన్ని కూడా 1991లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

వివాదంలో లేని 67 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని రామ జన్మభూమి నయాస్ కోరుతోందని పిటిషన్ లో కేంద్రం తెలిపింది. వివాదాస్పద భూమిని సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.  

More Telugu News